దేశ ప్రజలందరికీ టీకా అవసరం లేదు

by sudharani |
దేశ ప్రజలందరికీ టీకా అవసరం లేదు
X

న్యూఢిల్లీ : దేశ ప్రజలందరికీ కరోనా టీకా వేయాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్‌తో కేవలం వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్ తుంచితే చాలు అని కేంద్రం వెల్లడించింది. అందరికీ టీకా వేస్తామనీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ టీకా వేస్తామని ప్రభుత్వం ప్రకటించలేదని తెలిపారు. అలాంటి శాస్త్రీయ విషయాలన్నీ హేతుబద్ధ సమాచారం ఆధారంగానే చర్చించాలని అన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ టీకా సమర్థతపై ఆధారపడి ఉంటుందని, కరోనా వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్‌ను ధ్వంసం చేయడమే టీకా వేయడం వెనకున్న ప్రథమ లక్ష్యమని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ్ తెలిపారు. కీలకవర్గాలకు టీకా వేసి వైరస్ వ్యాప్తిని నిలువరించగలిగితే, అందరికీ టీకా వేయడం అనవసరమని అన్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఐదు లక్షలలోపే ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story