64.4 శాతంగా కరోనా రికవరీ రేట్

by  |
64.4 శాతంగా కరోనా రికవరీ రేట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని.. ఇది ఏప్రిల్‌లో 7.85 శాతం ఉండగా.. ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాకు చెందిన మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు.

మనదేశంలోనూ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారని, ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు సిద్ధం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఫేజ్ 1 దశలో ఉండగా.. మరో వ్యాక్సిన్ రెండో దశలో ఉందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed