‘కంగనా’కు వై కేటగిరి భద్రత..

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ ‘కంగనా రనౌత్‌’కు కేంద్రం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. హీరో సుశాంత్ సింత్ రాజ్‌పుత్ మృతి అనంతరం బాలీవుడ్ పెద్దలపై కంగనా బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. నెపోటిజం, డ్రగ్ మాఫియా, ముంబై పోలీసులపై పలుమాల్లు కంగనా ఘాటుగా స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.

దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనాను ముంబై‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ హెచ్చరించడమే కాకుండా.. తనపై దాడులు చేస్తామని బెదిరింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే కంగనాకు కేంద్రం ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉండగా, శివసేన ప్రభుత్వం బెదిరింపుల నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం కూడా కంగనాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement