నిరాశ వద్దు.. ఆ పథకాన్ని పొడిగించే యోచనలో కేంద్రం

by Harish |   ( Updated:2021-09-05 06:27:03.0  )
lether
X

దిశ, వెబ్‌డెస్క్: తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాన్ని 2025-26 వరకు పొడిగించవచ్చని తెలుస్తోంది. దీనిద్వారా తయారీ, ఎగుమతులు, ఉద్యోగ కల్పనను మరింత పెంచేందుకు ఈ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫుట్‌వేర్ లెదర్ అండ్ యాక్సెసరీస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఐఎఫ్ఎల్ఏడీపీ)ని రూ. 1,700 కోట్లతో అమలు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ మొత్తం వ్యయాన్ని 2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేయనున్నారని, కేంద్ర కేబినెట్ త్వరలో దీన్ని ఆమోదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం మొత్తం ఆరు విభాగాలకు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. సస్టైనబుల్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ కోసం రూ. 500 కోట్లు, లెదర్ విభాగం అభివృద్ధికి రూ. 500 కోట్లు, సంస్థాగత సౌకర్యాల కోసం రూ. 200 కోట్లు, లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ అభివృద్ధికి రూ. 300 కోట్లు, లెదర్, ఫుట్‌వేర్ విభాగంలో దేశీయ బ్రాండ్ల ప్రమోషన్ కోసం రూ. 100 కోట్లు, డిజైనర్ల అభివృద్ధికి రూ. 100 కోట్లను వెచ్చించనున్నారు. కాగా, ఇంతకుముందు ఐఎఫ్ఎల్ఏడీపీ కోసం 2017-19 నుంచి 2019-20 మధ్య కాలానికి రూ. 2,600 కోట్లను ఖర్చు చేశారు. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు పెట్టుబడులను సులభతరం చేసేందుకు, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed