రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

దిశ, వెబ్ డెస్క్ :
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

కరోనా సోకడంతో మానసికంగా కుంగిపోతున్న రోగులు తమ కుటుంబసభ్యులు, మిత్రులు, బంధువులతో మాట్లాడితే కాస్త ఊరట పొందుతారని… వారికి అవసరమైన వస్తువులు, ఫొన్లు, ట్యాబ్ లను సరఫరా చేయాలని కోరింది. అయితే, ఆ వస్తువులకు కూడా క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.

Advertisement