‘కోరోనిల్’ పై పతాంజలికి కేంద్రం ఝలక్

by  |
‘కోరోనిల్’ పై పతాంజలికి కేంద్రం ఝలక్
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 నివారణకు మందు తయారు చేశామని ప్రకటించిన పతాంజలి సంస్థకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆ సంస్థ సమర్పించిన లైసెన్స్ పత్రాల్లో కరోనా ప్రస్తావనే లేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఇమ్యూనిటీ బూస్టర్, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలను కంట్రోల్ చేసేందుకు మందులు తయారు చేస్తున్నామని దరఖాస్తులో పేర్కొన్నదని ఆయుష్ ప్రకటించింది. కానీ, కరోనాకు మందు తయారు చేసినట్టు ఎలా ప్రకటించుకున్నారో వివరణ కోరుతామని ఉత్తరాఖండ్ ఆయుర్వేద విభాగం లైసెన్స్ ఆఫీసర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పతాంజలి కరోనా ఆయుర్వేద డ్రగ్ యాడ్ ను కేంద్రం ఇప్పటికే నిలిపివేసింది. అంతేకాకుండా కనీస అనుమతులు పొందకుండా కోరోనిల్‌‌ను కరోనా మందుగా ప్రకటించడంపై బాబా రాందేవ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కరోనా మందును తయారు చేసినట్టు మంగళవారం పతాంజలి సంస్థ ప్రకటించుకోగా, దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నివేదికను ఆయుష్ విభాగానికి సమర్పించినట్టు రాందేవ్ బాబా చెప్పారు.


Next Story

Most Viewed