- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ.. ఇకనైనా శాంతించండి?
దిశ, వెబ్‌డెస్క్ : రైతు ఉద్యమనేత రాకేశ్ టికాయత్‌కు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేఖ రాసింది. మీరు కోరుకున్నట్టే రైతు చట్టాలను రద్దు చేశాము, కావున ఇకనైనా ఉద్యమాన్ని ముగించాలని ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాకేశ్ టికాయత్ ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
700 మంది రైతుల ఆత్మ బలిదానాల తర్వాత ఎట్టకేలకు కేంద్రం ప్రభుత్వం దిగొచ్చింది. ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా, రైతులు మాత్రం మద్దతు ధర (MSP) విషయంపై కూడా పార్లమెంటులో క్లారిటీ ఇచ్చాకే ఉద్యమాన్ని ముగిస్తామని పట్టుబట్టారు. దీనికి తోడు మొన్నీమధ్య రాకేశ్ టికాయత్ మరో సంచలన ప్రకటన చేశారు. రైతుల సమస్య తీరాక పబ్లిక్ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణపై చేయడంపై కూడా ఉద్యమిస్తామని తెలిపారు.