‘ఆ వివాహాలు దేశంలో… అనుమతించబడవు’

by  |
‘ఆ వివాహాలు దేశంలో… అనుమతించబడవు’
X

దిశ, వెబ్‌డెస్క్: స్వలింగ జంటల మధ్య జరిగే వివాహాలను అనుమతించకూడదని ఢిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది. ఈ వివాహాలను మన చట్టాలు, న్యాయ వ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించడం లేదని, అందువలన వీటిన మన దేశంలో “అనుమతించబడదు” అని కేంద్ర ప్రభుత్వం స్ఫష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ), స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ సోమవారం దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయాలు తెలుపాలని హైకోర్టు సూచించడంతో.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్ ధర్మాసనం ముందు వాదించిన తుషార్ మెహతా.. “వివాహం అనేది ఒక మత కర్మ. అయితే స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థ, మన సమాజం, మన విలువలు గుర్తించవు” అని వాదించారు. వివాహాల విషయాలపై ప్రపంచం మారుతున్నదని, అయినా ఇది భారతదేశానికి వర్తించకపోవచ్చు అని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, తక్షణ కేసుగా పిల్ అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అత్యవరసరమైన వారు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.


Next Story

Most Viewed