పర్యాటకులకు కేంద్రం గుడ్ న్యూస్

by Shamantha N |
పర్యాటకులకు కేంద్రం గుడ్ న్యూస్
X

న్యూఢిల్లీ: పర్యాటకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను ఈ నెల 16నుంచి తెరవనున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక ప్రదేశాలు, మ్యూజియాలను కేంద్రం మూసివేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టి పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలు, మ్యూజియాలను మళ్లీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ‘ఏఎస్ఐ ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాలు, స్మారక ప్రదేశాలు, మ్యూజియాలను జూన్ 16 నుంచి తెరిచేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కొవిడ్-19 ప్రొటోకాల్స్ పాటిస్తు ఆయా చారిత్రక కట్టడాలను, మ్యూజియాలను పర్యటకులు సందర్శించవచ్చు’అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed