తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు

by Anukaran |   ( Updated:2020-08-27 05:19:42.0  )
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. గురువారం పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తెలంగాణ నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్.. దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన వ్యవసాయశాఖ కార్యదర్శి.. వ్యవసాయాభివృద్ధి కోసం తెలంగాణ అనేక కార్యక్రమాలు చేస్తున్నదని ప్రశంసించారు. ఇదేక్రమంలో కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న అగ్చికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలపాలని కేంద్రమంత్రి తోమర్ కోరారు.

Advertisement

Next Story