రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన

by Anukaran |
రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యాసంగిలో పండించే పంటను కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై విరుచుకుపడింది.

ఈ క్రమంలో ఇప్పుడు పండిన ధాన్యం కొనకుండా వచ్చే యాసంగి గురించి గొడవ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ కాలయాపన చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇరు పార్టీల మాటల యుద్ధంలో రైతు బలిపశువు అవుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ రైతుల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్న వేళ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించుతూ తెలంగాణలో యథావిధిగా ధాన్యం కొంటామని కేంద్రం ప్రకటించింది. గతంలో నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్లపై కొనసాగిన గందరగోళం కేంద్రం నిర్ణయంతో తెరపడింది.

Advertisement

Next Story