పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..

by Anukaran |   ( Updated:2021-01-25 10:57:49.0  )
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీలను భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది(2021) 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. పద్మ అవార్డులు పొందిన వారి వివరాలు ఇవే..

పద్మ విభూషణ్…

షింజో అబే, పబ్లిక్ అఫైర్స్ (జపాన్), ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, కళలు (మరణానంతరం, తమిళనాడు), బెల్లె మొనప్ప హెగ్డే, వైద్యం (కర్ణాటక), నరేంద్ర సింగ్ కపనీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మరణానంతరం, అమెరికా), మౌలనా వహిదొద్దీన్ ఖాన్, ఆధ్యాత్మికం (ఢిల్లీ), బీబీ లాల్, పురావస్తుశాస్త్రం (ఢిల్లీ), సుదర్శన్ సాహు, కళలు(ఒడిశా) లకు పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.

పద్మ భూషణ్…

కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర, కళలు (కేరళ), తరుణ్ గొగోయ్, పబ్లిక్ అఫైర్ (అసోం), చంద్రశేఖర్ కంబరా, సాహిత్యం, విద్య (కర్ణాటక), సుమిత్రా మహాజన్, పబ్లిక్ అఫైర్స్ (మధ్యప్రదేశ్), నృపేంద్ర మిశ్రా, సివిల్ సర్వీసెస్ (మధ్రప్రదేశ్), రామ్ విలాస్ పాశ్వన్ పబ్లిక్ అఫైర్స్ (బిహార్), కేశుభాయ్ పటేల్, పబ్లిక్ అఫైర్స్ (గుజరాత్), కల్బే సాదిక్, ఆధ్యాత్మికం (ఉత్తర్‌ప్రదేశ్), రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్ వాణిజ్యం, పరిశ్రమలు (మహారాష్ట్ర), థార్‌లోచన్ సింగ్, పబ్లిక్ అఫైర్స్ (హర్యానా)లకు అవార్డు వరించింది.

Advertisement

Next Story