- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓటేసిన ప్రముఖులు

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. ఇక బీజేవైఎం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు.
నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్ లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓటు వేశారు.
ఇక ఫిల్మ్‌నగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓటు వేశారు. జూబ్లిహిల్స్ లో ప్రముఖ నటుడు చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక రాజేంద్రనగర్ డివిజన్ లోని ఉప్పర్ పల్లి లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్ సోమేష్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.