సిలబస్ తగ్గింపుపై సీబీఎస్ఈ వివరణ

by  |
సిలబస్ తగ్గింపుపై సీబీఎస్ఈ వివరణ
X

న్యూఢిల్లీ: సిలబస్ తగ్గింపుపై అపార్థాలు వ్యక్తమవుతున్నాయని, ఈ కుదింపు కరోనా కష్టకాలంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమని, కేవలం ఈ ఒక్క విద్యా సంవత్సరానికే వర్తిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పష్టం చేసింది. సిలబస్ నుంచి లౌకికత్వం, ప్రజాస్వామ్యం, భిన్నత్వం, ప్రజాస్వామ్య సవాళ్లు, సమాఖ్యావ్యవస్థ, సామాజిక, కొత్త సామాజిక ఉద్యమాలు, ప్లానింగ్ కమిషన్, పంచవర్ష ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాలు, కులం, మతం, లింగం వంటి చాప్టర్లు హేతుబద్ధీకరణలో భాగంగా తొమ్మిది నుంచి 12వ తరగతి సిలబస్ నుంచి తొలగించారు. కీలకమైన అంశాలను తొలగించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలుసంఘాలు, పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిలబస్ తగ్గింపు కేవలం 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమేనని, అది కూడా కరోనా కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే నిర్ణయించినట్టు సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ త్రిపాఠి వెల్లడించారు. 190 సబ్జెక్టుల నుంచి 30శాతం సిలబస్ తగ్గించామని తెలిపారు.


Next Story

Most Viewed