ప్రైవేట్ స్టూడెంట్స్‌కు షాక్ : 10,12వ తరగతి పరీక్షలపై CBSC కీలక నిర్ణయం

by Anukaran |
cbsc--exams
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2020-21కు సంబంధించి అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందోనని భావించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, పంజాబ్, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

చివరకు ప్రధాని మోడీ సలహా మేరకు CBSC బోర్డు కూడా 10,12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని CBSC ప్రకటించింది. పరీక్షలు నిర్వహించకుండా 10,12వ తరగతి ప్రైవేట్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSC తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో CBSC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed