ఎస్‌బీఐలో భారీ నోటిఫికేషన్

దిశ, వెబ్ డెస్క్: ఎస్బీఐలో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. తొలిసారి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల భర్తీకి కీలక ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 9 సర్కిళ్లలో 3,850 ఖాళీలు ఉండగా.. వీటిలో ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లో 550 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

నిబంధనలు

* ఏదైనా గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారు ఆ సర్కిల్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది.
* బేసిక్ శాలరీ రూ.23,000 కాగా, అలవెన్సులు కలుపుకుని రూ.40 వేలకు పైగా వేతనం తీసుకోనే అవకాశం ఉంది.
* షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ స్థాయిలో ఆగస్టు 1, 2020 నాటికి కనీసం రెండేళ్లు సర్వీస్ పూర్తి చేయాల్సి ఉండాలి.
* ఆగస్టు 1,2020 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు ఉంటుంది.
* జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఇతరులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
* షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, అవసరమైతే రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* మరిన్ని వివరాలకు https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/web/careers వెబ్ సైట్స్ ను సందర్శించవచ్చు.

Advertisement