- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కీలక వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలేస్తున్నట్లు సీబీఐ మెమో దాఖలు చేసింది. కోర్టు విచక్షణాధికారాల మేరకు ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 16కు కోర్టు వాయిదా వేసింది. ఇకపోతే అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి కోర్టు షరతులను ఉల్లంఘించారని..ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సీబీఐ కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ, విజయసాయిరెడ్డిలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.