- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 10వ తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
Next Story