- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్ : బిజినెస్ పేరుతో తీసుకున్న రుణాన్ని పక్కదారి పట్టించి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీతోపాటు ఆయన కంపెనీకి చెందిన 9 మంది డైరెక్టర్లపై కూడా కేసు నమోదైంది.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ పవ్ జెన్‌కమ్ లిమిటెడ్ సంస్థ చెన్నై ఎస్‌బీఐ ఎస్ఏఎంబీ బ్రాంచ్‌లో వ్యాపారం నిమిత్తం రూ.237.84 కోట్ల రుణం తీసుకుంది. అయితే రుణాన్ని వ్యాపారం కోసం కాకుండా దారి మళ్లించారని ఆ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.రవిచంద్రన్ ఈ నెల 23న చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఢిల్లీ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులందరూ కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటు ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం తదితర నేరాలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. బ్యాంకుల కన్షార్షియం నుంచి తీసుకున్న రుణాలను కుట్ర పూరితంగానే దారి మళ్లించారని అందులో పేర్కొంది.ఈ కేసుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అధికారికంగా స్పందిచలేదు. ఆ సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.