- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. పోలీసులను ఆశ్రయించిన సునీతారెడ్డి

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బుధవారం పదోరోజు కూడా అనుమానితులను విచారిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. చిట్వేల్‌కి చెందిన వైసీపీ నేతలు లక్ష్మీకర్, రమణ, సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. జగదీశ్వర్‌రెడ్డి గతంలో వివేకాకు పీఏగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ మొత్తాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అయితే హత్యకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తమకు భద్రత కల్పించాలని కోరారు.
Next Story