ఏటీఎంల నుంచి తగ్గిన నగదు ఉపసంహరణలు!

by  |
ఏటీఎంల నుంచి తగ్గిన నగదు ఉపసంహరణలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఏటీఎంల నుంచి కరెన్సీ నోట్ల ఉపసంహరణ భారీగా తగ్గిందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెలలో రూ. 1.27 లక్షల కోట్ల నగదును మాత్రమే ప్రజలు ఉపసంహరణ జరిపినట్టు, మార్చిలో ఇది రూ. 2.51 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం..ఏప్రిల్ నెలకు ఏటీఎంలలో జరిగిన లావాదేవీలు, నగదు ఉపసంహరణలు 28.66 కోట్లు తగ్గాయని, అంతకుముందు నెలలో ఇవి 54.71 కోట్ల జరిగాయని సమాచారం. ఏప్రిల్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండటమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల ద్వారా చేసే లావాదేవీల సంఖ్య కూడా అంతకుముందు నెలలో జరిగిన 54.41 కోట్లతో పోలిస్తే, ఏప్రిల్‌లో దాదాపు సగానికి పడిపోయి 28.52 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్‌ నాటికి దేశంలో 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్లు డెబిట్‌ కార్డులుండగా, 5.73 కోట్ల క్రిడెట్‌ కార్డులున్నాయి. అంతకుముందు నెల మార్చిలో మొత్తం 88.63 కోట్ల కార్డులున్నాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు కూడా డిజిటల్‌ చెల్లింపులు చేయడంతో పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) వద్ద నగదు ఉపసంహరణలు ఏప్రిల్‌లో రూ. 111 కోట్లు జరిగాయి.



Next Story