- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తుపాకీ గురిపెట్టి నగదు, మొబైల్ అపహరణ

దిశ, కుత్బుల్లాపూర్ : గన్‌తో బెదిరించి నగదు, మొబైల్ దోచుకెళ్లిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ అయోధ్యనగర్‌కు చెందిన రవికుమార్ స్థానికంగా లక్ష్మి మనీ ట్రాన్స్ ఫర్ కేంద్రాన్ని గత 8 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం షాపులో ఉన్నాడు.
రాత్రి 9:30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తలకు హెల్మెట్ పెట్టుకుని లోపలికి వచ్చారు. వెంటనే గన్ బయటకు తీసి లోడ్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని యాజమానిని బెదిరించారు. భయాందోళనకు గురైన రవి తన వద్దనున్న రూ.1.90 వేల నగదుతో పాటు సెల్ ఫోన్ అప్పగించగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బయటకు వచ్చి చూసే సరికి నెంబర్ ప్లేట్ లేని యాక్టివా వాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.