- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌పై కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. యువీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో సందర్భంగా యువరాజ్ సింగ్.. తోటి క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో యువరాజ్ సింగ్‌పై హర్యాణా దళిత హక్కుల నేత రజత్ కల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్ సింగ్ టీమిండియా బౌలర్ యుజవేంద్ర చాహల్‌ను ‘భాంగీ’ అని సంభోదించాడు. దీంతో యువరాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్ సింగ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. హర్యాణా హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనపై భారతీయ చట్టం ప్రకారం 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.