వరంగల్ సీపీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

by Sumithra |
వరంగల్ సీపీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
X

దిశ, వరంగల్ : జిల్లా సీపీ రవీందర్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కు ఫిర్యాదు అందింది. తనపై అక్రమ కేసులు బనాయిస్తూ.. మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో మాదాడి రఘుమారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘురామరెడ్డి మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసులు పెట్టి భూకబ్జాదారుడిగా చిత్రీకరించారని వెల్లడించారు.

ఒకే కేసు విషయంలో నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని వాపోయారు. వరంగల్ సీపీ రవీందర్, ఏసీపీ మూల జితేందర్ రెడ్డి, ఎస్సై ఎన్ వీరేందర్‌లతో పాటు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని హెచ్చార్సీని కోరినట్టు రఘుమారెడ్డి తెలిపాడు.

tags:HRC, Human rights commission, warangal, CP, Ravinder, real estate, FIR, police, SI, ACP

Advertisement

Next Story