ఇద్దరు కాకతీయ ప్రొఫెసర్లపై కేసు

by Anukaran |
ఇద్దరు కాకతీయ ప్రొఫెసర్లపై కేసు
X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరి ప్రొఫెసర్లపై మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ లోనే అంత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన కాకతీయ విశ్వవిద్యాలయంలోని ప్రభుత్వ పాలన, మానవ వనరుల విభాగంలో విభాగాదిపతి డా.పెదమళ్ల శ్రీనివాసరావు ఇద్దరు ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనపై ప్రొఫెసర్ కె.మహేందర్ రెడ్డి, డా.మామిడాల ఇస్తారి.. కుట్ర పూరితంగా కక్షగట్టి మానసికంగా వేధిస్తూ, విద్యార్థుల ముందు అవమాన పరుస్తూ, విద్యార్థులను తనపైకి రెచ్చగొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డా.పెదమల్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత కొద్దికాలంగా ఆ ఇద్దరు ప్రొఫెసర్లు తనపై అసత్య ప్రచారం చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. ఇటీవల అక్టోబర్ 2వ తేదీన ఏర్పాటు చేసిన విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశం సందర్భంగా.. తనపై కుట్రపూరితంగా అవమానకర రీతిలో లేనిపోని ఆరోపణలు చేయడమే గాక ప్రొఫెసర్ కె.మహేందర్ రెడ్డి మానసిక ఆవేదనకు గురిచేశారన్నారు. అంతేకాకుండా సమావేశంలో సంబంధం లేని డాక్టర్ మామిడాల ఇస్తారి పాల్గొని తనపై అసభ్య పదజాలంతో మాట్లాడి అవమానపరిచారన్నారు.
ఈ నెల 5 వ తేదీన జరిగిన సంఘటనపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరిపై కేసులు నమోదు చేశారని శ్రీనివాసులు తెలిపారు. 2948, 500, 506, IPC 92(A) వికలాంగుల చట్టం 2016 ప్రకారం కాకతీయ విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ లో దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా కేయూ ప్రొఫెసర్లు అయిన మహేందర్ రెడ్డి, ఇస్తారిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Advertisement

Next Story