కొవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన బాలీవుడ్ లవ్ బర్డ్స్.. కేసు నమోదు

by Shyam |
కొవిడ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన బాలీవుడ్ లవ్ బర్డ్స్.. కేసు నమోదు
X

దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పఠానీలపై కేసు నమోదైంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కొవిడ్ ప్రొటోకాల్స్ అతిక్రమిస్తూ కారులో డ్రైవ్‌కు వెళ్లడంతో ముంబై పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత బయటకు వెళ్లకూడదనే నిబంధన అమలవుతుండటంతో దీనిపై ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని కోరారు. కానీ వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది బెయిలెబుల్ సెక్షన్ కావడంతో వారిని అరెస్ట్ చేయలేదు.
కాగా ఈ కేసు రిజిస్టర్ అయ్యాక ముంబై పోలీసుల చేసిన ట్విట్టర్ పోస్ట్ వైరల్ అయింది. అంతే కాకుండా దిశ, టైగర్‌ ష్రాఫ్‌ల సినిమా పేర్లను ఉపయోగిస్తూ రూల్స్‌ అతిక్రమిస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందో తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘వైరస్‌తో ‘వార్’ జరుగుతున్న సమయంలో బాంద్రా వీధుల్లో ‘మలంగ్’ వెళ్లిన ఇద్దరు నటులపై పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 188, 34 కింద కేసు నమోదైంది. అందుకే అనవసర ‘హీరోపంతి’ని అవాయిడ్ చేయాలని ముంబై వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాము’ అని కోరారు.

Advertisement

Next Story