- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బండి సంజయ్‌పై కేసు నమోదు
by Shyam |

X
దిశ, నల్లగొండ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో సహా పలువురు ఆ పార్టీ నాయకులపై పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ వివరాల ప్రకారం.. మంగళవారం పెద్దవూర పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తాయి తోటలను పెద్ద ఎత్తున పార్టీ నేతలతో పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, భౌతికదూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించడంతో సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.
Next Story