మాస్కులు లేకుండా తిరుగుతున్న 15 మందిపై కేసు

by Shyam |

దిశ, నల్లగొండ: ముఖానికి మాస్కు ధరించకుండా వీధుల వెంట తిరుగుతున్న 15 మందిపై కేసు నమోదు చేసినట్టు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరించి వీధుల్లో తిరుగుతున్న వివిధ గ్రామాలకు చెందిన 15 మందిపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. అదే విధంగా లాక్‌డౌన్ ఉత్తర్వులు పట్టించుకోకుండా నడుపుతున్న మూడు కిరాణా షాపుల యజమానులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

tags: without mask, 15 mem case filed, lockdown, rules break


Advertisement
Next Story

Most Viewed