- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థింక్ డిఫరెంట్ అన్న పెళ్లి కూతురు.. ఫ్యామిలీ మొత్తంపై పోలీస్ కేసు!
దిశ, వెబ్‌డెస్క్ : తనకు జరిగే పెళ్లి జీవితాంతం గుర్తుండిపోవాలని ఆ పెళ్లికూతురు భావించింది. అందుకోసం ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబం మొత్తాన్ని ఇరకాటంలో పడేసింది. ఇంటి నుంచి పెళ్లి మండపానికి వెళ్లేందుకు ఆమె చేసిన సాహసమే అందుకు కారణం. ‘థింక్ డిఫరెంట్’ అనే పెళ్లి కూతురి కాన్సెప్టుకు పోలీసులు చెక్ పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని భోసరికి చెందిన 23 ఏళ్ల శుభంగి శాంతారామ్ జరాండే తన పెళ్లి వేడుక మొమోరబుల్‌గా ఉండాలని భావించి స్కార్పియో ఎస్‌యూవీ వాహనం బ్యానెట్ పైకి ఎక్కి పెళ్లి మండపానికి చేరుకుంది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. ఆ సమయంలో కొవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేసిందనే కారణంతో హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎల్ నెవ్సే ఫిర్యాదు ఆధారంగా పూణే నగర పోలీస్ పోలీసుల పరిధిలోని కల్భోర్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పెళ్లి కూతురుతో పాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ శుభంగి గణేష్ శ్యామరావు లావాండే (38), వాల్ హేకర్వాడికి చెందిన తుకారాం సౌదగర్ షెడ్జ్ (23), అకుర్ది, వాహనంలో ప్రయాణిస్తున్న ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, జరాండే పెళ్లి వేడుక సాస్వాద్ సమీపంలోని సిద్ధేశ్వర్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఆ సమయంలో లావాండే అనే వ్యక్తి వాహనాన్ని నడుపుతుండగా శుభంగి జరాండే స్కార్పియో వాహనం బ్యానెట్ మీద కూర్చుంది. ఈ దృశ్యాన్ని వీడియో గ్రాఫర్ ముందు బైక్ పై వెళ్తూ చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.
పెళ్లి కూతురు నిర్ణయం పట్ల ఆమెపై, ఫ్యామిలీపై సెక్షన్ 269 (ఏదైనా వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేసే నిర్లక్ష్య చర్య), 188 (ప్రభుత్వ ఉద్యోగి చేత ప్రకటించబడిన చట్టానికి అ విధేయత), 279 (రాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), 107 (అబెట్మెంట్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు అపాయం కలిగించే చర్య), భారత శిక్షాస్మృతి యొక్క 34 (సాధారణ ఉద్దేశం) మరియు విపత్తు నిర్వహణ చట్టం, మహారాష్ట్ర కొవిడ్ రూల్స్-2020 మరియు మోటారు వాహనాల చట్టం సంబంధిత విభాగాలు” కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మోకాషి తెలిపారు. ప్రస్తుతం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని త్వరలోనే తీసుకుంటామని పోలీసులు తెలిపారు.