భూమి కొట్లాట.. 25మందిపై కేసు

by  |
భూమి కొట్లాట..  25మందిపై కేసు
X

దిశ, నల్లగొండ : సూర్యాపేట జిల్లా నేలమర్రిలో భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రభుత్వం దళితులకు అందజేసిన మూడెకరాల భూమి విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలు కొట్టుకున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో 2017 సంవత్సరం గ్రామానికి చెందిన 20 మంది రైతులకు ప్రభుత్వం తరఫున 60 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.అయితే, గ్రామంలో మరింత మంది అర్హులు ఉండటం వలన ఆ 60 ఎకరాల భూమిని పట్టాపొందిన వారితో పాటు అర్హులు కూడా కలిసి సాగు చేసుకునేలా పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. నాటి నుంచి ఈ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ భూమిలో కొందరు సాగు చేసేందుకు వెళ్లగా.. పట్టాలు పొందిన 20మంది రైతులు అడ్డుకున్నారు. ఫలితంగా ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. 25 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు.


Next Story

Most Viewed