- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నకిలీ వెబ్‌సైట్ నిర్వాహకులపై కేసు
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నకిలీ వెబ్‌సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తామంటూ డిసెంబరు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్, ఐటీ విభాగాల అధికారులు సదరు నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు.
Next Story