ఢిల్లీ వెళ్లిన సమాచారం ఇవ్వని వ్యక్తిపై కేసు

by Sridhar Babu |   ( Updated:2020-04-03 23:43:42.0  )

దిశ, కరీంనగర్

ఢిల్లీకి వెళ్లొచ్చిన విషయాన్ని దాచిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు. బొంకూరి నరేందర్ అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లొచ్చిన విషయాన్ని అధికారులకు చెప్పకుండా, లాక్‌డౌన్ సమయంలో పట్టణానికి చెందిన పలువురితో సన్నిహితంగా మెలిగాడు. ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 269, 270,188 కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని ప్రజలు ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: peddapalli ,ci, case file, delhi, lockdown, coronavirus, markaz masjid



Next Story

Most Viewed