- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందులో 25 శాతం వాటా కొనుగోలు చేసిన కార్లయిల్ గ్రూప్!
దిశ, వెబ్ డెస్క్: భారతీయ ఎయిర్‌టెల్‌కు చెందిన డేటా సెంటర్‌కు చెందిన ఎన్ఎక్స్‌ట్రా డెటా లిమిటెడ్‌లో అమెరికాకు చెందిన కార్లయిల్ గ్రూప్ 25 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ కొనుగోలు విలువ సుమారు రూ. 1,762 కోట్లు. ఎయిర్‌టెల్ వద్ద 75 శాతం వాటా అలాగే ఉండనుంది. ఇండియాలోని రెగ్యులేటరీ నిబంధనలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియంత్రణ ఆమోదాలకు అనుగుణంగానే లావాదేవీలు, ఒప్పందం ఉంటుందని ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఎక్స్‌ట్రా డేటా సెంటర్ నుంచే ఇండియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు, ఎస్ఎంఈలకు సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్ఎక్స్‌ట్రాకు 10 భారీ డేటా సెంటర్లు, 120 అదనపు డేటా సెంటర్లు కలిగి ఉంది. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఈ రంగంలో బలపడేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని, అలాగే, కార్లయిల్ సంస్థ వ్యూహాత్మక భాగస్వామిగా కలవడం సంతోషమని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. కార్లయిల్ ఆసియా పార్ట్‌నర్స్ అడ్వైజరీ టీం ఎండీ నీరజ్ భరద్వాజ్ స్పందిస్తూ.. డిజిటల్ సేవల రంగంలో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని అభిప్రాయపడ్డారు.