- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BC, OBC : బీసీ, ఓబీసీ సర్టిఫికెట్స్ వేర్వేరుగా ఎందుకు ఉంటాయంటే?

దిశ, వెబ్ డెస్క్ : మనం తరచుగా బీసీ(BC), ఓబీసీ(OBC) సర్టిఫికెట్స్ గురించి వింటూ ఉంటాం. జాబ్ నోటిఫికేషన్స్(Job Recruitments) కి అప్లై చేసే సమయంలో, హయ్యర్ ఎడ్యుకేషన్లో(Higher Education) ఇవి అవసరమవుతుంటాయి. ఈ రెండూ వేర్వేరు కాగా, సరైన అవగాహన లేక బీసీ, ఓబీసీ ఒక్కటే అనుకుంటారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తించిన వెనకబడిన కులాల జాబితాలో ఉన్నటువంటి వారందరినీ ఓబీసీ(Other Backward Classes) కులాలకు చెందినవారిగా పరిగణిస్తారు. వారికి మాత్రమే ఓబీసీ సర్టిఫికెట్స్ జారీ చేస్తారు. బీసీ సర్టిఫికెట్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. అయితే ఇది కేవలం రాష్ట్రానికే పరిమితమై ఉంటుంది. జేఈఈ, నీట్, యూసీజీ సీట్ల భర్తీకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఓబీసీ సర్టిఫికెట్ అవసరం అవుతుంది.
స్థానిక తహసీల్దార్లు(MRO) జారీ చేసే ఈ ధ్రువీకరణ పత్రాలు ఏడాది మాత్రమే చెల్లుబాటవుతాయి. అందుకే విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త ఓబీసీ సర్టిఫికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కాగా కొన్నింటి నోటిఫికేషన్లు వచ్చే ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ వర్గానికి చెందిన పది, ఇంటర్ చదివే విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. నేషనల్ లెవెల్ స్కాలర్షిప్దరఖాస్తుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించింది. కేంద్రం ప్రభుత్వం మాత్రం అందరినీ కలిపి ఓబీసీలుగా గుర్తిస్తుంది. కాగా ఈ ధ్రువీకరణ పత్రానికి అభ్యర్థులు మీ-సేవ కేంద్రాల్లో(Mee Sevaa Centers) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్లో అభ్యర్థి పూర్తి వివరాలతో పాటు తల్లిదండ్రుల వార్షికాదాయం తదితర వివరాలు నమోదు చేసి, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఆర్‌ఐ, తహసీల్దార్ విచారణ చేసి అర్హత ఉంటే జారీ చేస్తారు. క్యాస్ట్,ఇన్కమ్కు ఒక్కసారి అప్లై చేస్తే ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. తొలిసారి తీసుకున్న క్యాస్ట్, ఇన్కమ్ ధ్రువపత్రాలకు సంబంధించిన రసీదుపై అప్లికేషన్ నంబర్ ఉంటుంది. రెండో సారి అదే డాక్యుమెంట్ అవసరం అయినప్పుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి అప్లికేషన్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే గతంలో పొందిన ధ్రువపత్రాల సమాచారం కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు చిరునామా, సెల్ఫోన్ నంబర్ నమోదు చేసి 35 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.