- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS-SET నోటిఫికేషన్ విడుదల..ఎగ్జామ్ ఎప్పుడంటే?
దిశ,వెబ్‌డెస్క్: అసిస్టెంట్ ప్రోఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే 2024 సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి TS SET 2024 నోటిఫికేషన్ శనివారం విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్య తేదీలు ప్రకటించారు. ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ - 2024 TS-SET పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ- OU నిర్వహించనుంది.
మే 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఫైన్‌తో జూలై 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ కు అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఆగస్టు 28 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం అధికారిక http://www.telanganaset.org/ వెబ్‌సైట్‌ని సందర్శించండి.