UPSC ESE ప్రిలిమ్స్ 2024 ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

by Sumithra |
UPSC ESE ప్రిలిమ్స్ 2024 ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూసుకోవచ్చు. అంతేకాకుండా మెయిన్ పరీక్ష తేదీని కూడా కమిషన్‌లో విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష 18 ఫిబ్రవరి 2024 న దేశవ్యాప్తంగా నియమించిన కేంద్రాలలో నిర్వహించారు.

ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హులు అవుతారు. మెయిన్స్ పరీక్ష 23 జూన్ 2024న నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను కమిషన్ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, మీరు జారీ చేసిన నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.

UPSC ESE ప్రిలిమ్స్ 2024 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ?

UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inకి లాగిన్ అవ్వండి.

హోమ్ పేజీలో UPSC ESE ప్రిలిమినరీ ఫలితం 2024 లింక్‌ పై క్లిక్ చేయండి.

ఒక PDF స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇప్పుడు రోల్ నంబర్ సహాయంతో ఫలితాన్ని తనిఖీ చేయండి.

ప్రధానపరీక్ష అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీకి వారం ముందు UPSC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారని, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2023లో విజయం సాధించిన అభ్యర్థుల కోసం UPSC ఇంటర్వ్యూ జాబితాను విడుదల చేసింది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఇంటర్వ్యూ 22 ఏప్రిల్ నుంచి 1 మే 2024 వరకు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed