- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TSPSC గ్రూప్ 3 సిలబస్ విడుదల

దిశ, కెరీర్: TSPSC Group 3 కి సంబంధించి మొత్తం 1365 ఖాళీలు ఉన్నాయి. TSPSC Group 3 దరఖాస్తుల ప్రక్రియను జనవరి 24న ప్రారంభించింది. దరఖాస్తుకు ఫిబ్రవరి 23 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ను విడుదల చేసింది TSPSC.
ఈ నోటిఫికేషన్లో గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సిలబస్, ఎగ్జామ్ విధానం తదితర వివరాలను పొందుపర్చింది. దీనిలో మొత్తం 450 మార్కులకు రాతపరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 3 పేపర్లు ఉండగా.. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి.
పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు
పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు
పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు ఉంటాయి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల సమయం ఉంటుందని పేర్కొంది.
ప్రశ్నాప్రతం మొత్తం మూడు భాషల్లో.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉంటుందని వెల్లడించారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in