సింబయోసిస్‌ ప్రవేశ పరీక్ష (సెట్‌) రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..

by Vinod kumar |
సింబయోసిస్‌ ప్రవేశ పరీక్ష (సెట్‌) రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..
X

దిశ, వెబ్‌డెస్క్: సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) (ఎస్‌ఐయు) నేడు సింబయోసిస్‌ ప్రవేశ పరీక్ష (సెట్‌) కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించింది. మే 06 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగనున్నాయి. పలుమార్లు ఈ సెట్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎస్‌ఐయు కింద ఉన్న 16 ఇనిస్టిట్యూట్‌లు అందిస్తున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను మేనేజ్‌మెంజ్‌, లా, ఇంజినీరింగ్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఎకనమిక్స్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, ఐటీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, అప్లయ్డ్‌ స్టాటిస్టిక్స్‌, డాటా సైన్స్‌లో ఎంచుకోవచ్చు.

సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) (ఎస్‌ఐయు) వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రజని గుప్తే మాట్లాడుతూ.. '' జాతీయ విద్యావిధానం 2020 ఇప్పుడు మన దేశపు విద్యావిధానాన్ని సమూలంగా మార్చనుంది. ఈ విజనరీ పాలసీ, అభివృద్ధి, సౌకర్యం, నూతన తరపు అభ్యాసం పరంగా నూతన శిఖరాలకు తీసుకువెళ్తుంది. సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ వద్ద, మేము ఇప్పటికే ఎన్‌ఈపీ 2020 సూచించిన పలు ప్రోగ్రామ్‌లను అమలు చేస్తున్నామన్నారు. మా పలు ప్రోగ్రామ్‌లను సమగ్రమైన, మల్టీ డిసిప్లీనరీ విద్యను మా విద్యార్ధులకు అందిచేందుకు తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లో విజయవంతమయ్యేందుకు ఇవి తోడ్పడనున్నాయి'' అని అన్నారు.

ఈ ప్రవేశ పరీక్షలను సెట్‌, స్లాట్‌ (సెట్‌–లా), సిటీ (సెట్‌ –ఇంజినీరింగ్‌)గా విభజించడం వల్ల వారు ద్వారా ఒకటికి మించిన పరీక్షలకు హాజరుకావొచ్చు. ఈ ప్రవేశ పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు 1950 రూపాయలు. కాగా, ఒక్కో ప్రోగ్రామ్‌కూ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1,000 రూపాయలు ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో భారతదేశ వ్యాప్తంగా 76 నగరాలలో నిర్వహించనున్నారు.

Advertisement

Next Story