IIT గౌహతిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

by Sumithra |
IIT గౌహతిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతిలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రోగ్రాం కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31. ఇంటర్న్‌షిప్ కోసం ఎలాంటి రుసుము కట్టనవసరం లేదు. మెస్ చార్జీలు మాత్రం కట్టవలసి ఉంటుంది.

సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఈ అవకాశాన్ని ఐఐటీ గౌహతిలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి మే 15 నుండి జూలై 15 మధ్య ఉంటుంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే IIT గౌహతి అధికారిక వెబ్‌సైట్ iitg.ac.in నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ఎలా జరుగుతుంది ?

ఫ్యాకల్టీ సభ్యులు వేసవి ఇంటర్న్‌షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థి భారతీయుడిగా ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ నుంచి బీటెక్/బీఈ చేస్తున్న ఆరో సెమిస్టర్ విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి CGPA తప్పనిసరి. అర్హత గల అభ్యర్థులు IIT గౌహతి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి. ఈ ఇంటర్న్‌షిప్ రెండు నెలల పాటు ఉంటుంది. మరింత సమాచారం కోసం IIT గౌహత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

సర్టిఫికెట్ జారీ..

ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం (సిఎస్‌ఇ విభాగం) సర్టిఫికేట్ జారీ చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక జాబితాను ఏప్రిల్ 8న విడుదల చేస్తారు. ఇతర సమాచారం ఏప్రిల్ 15 న రిలీజ్ చేయనున్నారు. సమ్మర్ ఇంటర్న్‌షిప్ గురించి మరిన్ని మార్గదర్శకాలు, నియమాలను తెలుసుకోవడానికి IIT గౌహతి అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి నోటిఫికేషన్‌ను చదవండి.

Advertisement

Next Story

Most Viewed