SSC GD Constable Results: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

by Maddikunta Saikiran |
SSC GD Constable Results: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర సాయుధ బలగాల్లోని 46,617 కానిస్టేబుల్(Constable), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గత ఏడాది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నియామక పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలను(Final Results) ఎస్‌ఎస్‌సీ ఈ రోజు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/home లో అందుబాటులో ఉన్నాయని ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. కాగా ఈ పోస్టులకు సంబధించి రాత పరీక్షలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి జూలై/ ఆగస్టు నెలల్లో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST) నిర్వహించారు. ఇందులో పాసైన వారికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. తాజాగా ఈ రోజు ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించారు.

Advertisement

Next Story