KVS అడ్మిషన్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ తేదీ నుంచి 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు..

by Sumithra |
KVS అడ్మిషన్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ తేదీ నుంచి 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు..
X

దిశ, ఫీచర్స్ : కేంద్రీయ విద్యాలయ సంగతన్ 2024-25 అకడమిక్ సెషన్ కోసం 1 నుండి 11 తరగతులలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 15వ దేది సాయంత్రం పూట 5 గంటల సమయం వరకు కొనసాగుతుంది. 10 బోర్డు పరీక్షల ఫలితాలు ప్రకటించిన 10 రోజుల తర్వాత 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు kvsangathan.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

1వ తరగతిలో ప్రవేశానికి, పిల్లల వయస్సు మార్చి 31, 2024 నాటికి కనీసం ఆరు సంవత్సరాలు నిండి ఉండాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. KVS ప్రకారం, క్లాస్ 2, తదుపరి తరగతులకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బాల వాటికా 1 నుంచి 3 తరగతుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

SC, ST, OBC కేటగిరీ పిల్లలు కూడా KVS అడ్మిషన్ 2024లో రిజర్వేషన్ ప్రయోజనం పొందుతారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీ వర్గాలకు 27% సీట్లు రిజర్వు చేశారు.

ఈ తేదీలను గుర్తుంచుకోండి..

1వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. నమోదు చేసుకున్న విద్యార్థుల మొదటి ఎంపిక, వెయిటింగ్ లిస్ట్ ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 29న రెండో జాబితా, మే 8న మూడో జాబితా విడుదల చేస్తారు.

ఎలా నమోదు చేయాలి ?

KVS kvsangathan.nic.in అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

హోమ్ పేజీలోని అకడమిక్ ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు నోటిఫికేషన్ చదివి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోండి.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు..

పిల్లల ఒరిజినల్ జనన ధృవీకరణ పత్రం, SC/ST/OBC సర్టిఫికేట్ (వర్తిస్తే), నివాస ధృవీకరణ పత్రం, పిల్లల ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పిల్లల రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు కావలసి ఉంటుంది. ఇకపోతే దేశవ్యాప్తంగా మొత్తం 1254 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం మొత్తం 14,00,632 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed