- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IGNOU: ఇగ్నో యూనివర్సిటీలో మరో కొత్త కోర్సు.. అడ్మిషన్లకు తుదిగడువు ఆ రోజే

దిశ, వెబ్ డెస్క్: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) లో కొత్తగా మరో కోర్సును ప్రారంభించారు. ఈ మేరకు ఇగ్నో (IGNOU) సంచాలకులు కే.రమేష్ (Director K. Ramesh) ఓ ప్రకటన (statemen) విడుదల చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Indira Gandhi National University) జనవరి 2025 వ సంవత్సరం అడ్మిషన్ లలో నూతనంగా ఎమ్మెస్సి కెమిస్ట్రీ (MSc Chemistry) కోర్సుని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రములో (Hyderabad regional center) ఈ ప్రోగ్రాముని "నిజాం" కళాశాల ("Nizam" College) యందు గల ఆధ్యయన కేంద్రములో ప్రారంబిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే ఎమ్మెస్సి కెమిస్ట్రీలో అడ్మిషన్ పొందడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 3 లేదా 4 సంవత్సరాలు బీఎస్సీ డిగ్రీ (B.Sc degree) కనీసపు ఆర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఎమ్మెస్సి కెమిస్ట్రీ ద్వారా రసాయన పరిశ్రమ (chemical industry), బోధనా (teaching), పరిశోధన (Research sectors) రంగంలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు (job opportunities) లభిస్తాయని వివరించారు. ఈ కోర్సు కోసం అడ్మిషన్ల ప్రక్రియను ఇదివరకే ప్రారంభించామని, ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ (Admission) పొందడానికి జనవరి 31, 2025 చివరి తేదీగా నిర్ణయించినట్లు హైదరాబాద్ కేంద్ర సంచాలకులు డా. కే రమేష్ ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రంగా 1987 లో ప్రారంభమైంది. ఇదులో యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా (Diploma), పలు సర్టిఫికేషన్ కోర్సులు (Certification Cources) సహా మొదలగు కోర్సులను అందిస్తుంది. ఇగ్నోలో ప్రారంభంలో కేవలం డిప్లొమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (Diploma in Distance Education), డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ (Diploma in Management) అనే రెండు కోర్సులు మాత్రమే ఉండగా.. విద్యార్థుల ఆసక్తి మేరకు మరిన్ని కోర్సులను ప్రవేశ పెట్టి విద్యను అందిస్తున్నారు.