IBPS RRB నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

by Seetharam |
IBPS RRB నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ,వెబ్‌డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS), రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(RRB)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలతో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జూన్‌ 1న విడుదల కానుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్తులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023

పోస్టుల వివరాలు:

1) గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3)

2) గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌)

అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.

చివరితేది: 21.06.2023.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

వెబ్‌సైట్: https://www.ibps.in/

Advertisement

Next Story