Gurukula Schools Admissions: విద్యార్థులకు శుభవార్త.. గురుకుల ఐదో తరగతి ప్రవేశాలకు ప్రకటన ఎప్పుడంటే..!

by Maddikunta Saikiran |
Gurukula Schools Admissions: విద్యార్థులకు శుభవార్త.. గురుకుల ఐదో తరగతి ప్రవేశాలకు ప్రకటన ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(TG) రాష్ట్రంలోని గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి ప్రవేశాల(5th class Admissions) కోసం ఈ నెల 18న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిణి(Varshini) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే మే 15 వరకు ఐదో తరగతి అడ్మిషన్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అప్లికేషన్ ప్రాసెస్(Application Process), సొసైటీ(Society) వారీగా సీట్ల కేటాయింపు మరింత సులభతరం(Easy) చేశామని వివరించారు. కాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లోని పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం(EM) విద్యతో పాటు, ఉచిత భోజన(Free Food), వసతి(Hostel) సౌకర్యాలు కల్పిస్తారు.

Advertisement

Next Story

Most Viewed