- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రూప్ -3 సిలబస్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
by Nagaya |

X
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా సిలబస్ ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ లో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు సిలబస్ ను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మొత్తం 3 పేపర్లు ఉండగా పేపర్-1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2 లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఉన్నాయి. ఈ మూడు పేపర్లకు 450 మార్కులు ఉండనున్నాయి. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1363 పోస్టుల ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లికేషన్లకు ఫిబ్రవరి 23వ తేదీ వరకు అవకాశం ఉంది.
Next Story