AP EAP Cet 2025 : ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

by Prasanna |
AP EAP Cet 2025 : ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు ఏపీ ఈఏపీ సెట్ 2025 ( AP EAP Cet 2025 ) నోటిఫికేషన్‌‌ను జేఎన్టీయూ కాకినాడ ( Jntu Kakinada ) విడుదల చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు ఆన్లైన్ బేస్డ్‌ టెస్ట్ ద్వారా ఈఏపీ సెట్ ను నిర్వహిస్తారు.

ఈ ఏపీ ఈఏపీ సెట్ ( AP EAPCET 2025 ) కు సంబంధించిన దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు : మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.

ఇంజనీరింగ్ పరీక్షలు : మే 21 నుంచి 27 వరకు జరుగుతాయి.

అప్లికేషన్ ఫీజు : ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ఇతర కేటగిరి అభ్యర్థులు రూ.900 ఫీజును చెల్లించాలి.

రెండు పేపర్లకు అప్లై చేసినట్లయితే, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 1000 ను చెల్లించాలి.

మిగిలిన అభ్యర్థులు రూ.1800 ను చెల్లించాలి.

రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ఈ సెట్‌ను పరీక్షను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోవడానికి ఈ లింక్ పై cets.apsche.ap.gov.in క్లిక్ చేయండి.

Next Story

Most Viewed