- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Agniveer Vayu Posts: పెళ్లికాని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు

దిశ, వెబ్ డెస్క్: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) (02/ 2025) ఖాళీల భర్తీకి నియామక ప్రకటన విడుదలైంది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' చేపట్టే ఈ నియామకంలో నాలుగేళ్ల లిమిటెడ్ సర్వీస్‌తో రిక్రూట్‌మెంట్ చేపడతారు. అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్లితే..
*క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, లాన్ టెన్నిస్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్.
*అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్) లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), నిర్దిష్ట శారీరక / వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
*ఎత్తు: కనీసం 152 సెం.మీ. ఉండాలి.
*వయసు: 3 జూలై 2004 నుంచి 3 జనవరి 2008 మధ్య జన్మించినవారు అర్హులు.
*ఎంపిక: సెలక్షన్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
*రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.
*ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 22
*రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: మార్చి 10 నుంచి 12 వరకు ఉంటుంది.
*వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/