నెల వ్యవధిలో మూడోసారి వృద్ధి రేటును సవరించిన కేర్ రేటింగ్స్

by Harish |
నెల వ్యవధిలో మూడోసారి వృద్ధి రేటును సవరించిన కేర్ రేటింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసుల పెరుగుదల మధ్య అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 10.2 శాతానికి సవరిస్తున్నట్టు తెలిపింది. గత నెలలో సంస్థ వృద్ధి రేటును 10.7 శాతం నుంచి 10.9 శాతంగా అంచనా వేసింది. గత నెల రోజుల్లో కేర్ రేటింగ్స్ మూడోసారి వృద్ధి రేటును సవరించింది. ఇటీవల నెల రోజుల్లో పరిస్థితులు వేగంగా మారిపోయినందునే వృద్ధి అంచనాను సవరించామని రేటింగ్ సంస్థ పేర్కొంది. కీలక రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి దెబ్బతిన్నాయని, అందుకే ఇదివరకు సవరించిన దాన్ని మరోసారి సవరిస్తున్నట్టు వివరించింది. రానున్న మరో 15 రోజులు భారత్‌కు కఠినంగా ఉండనున్నట్టు కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అలాగే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పన్ను వసూళ్లు ప్రభావితమవుతాయని, ఇది జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది.

Advertisement

Next Story