- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత వృద్ధి రేటును సవరించిన కేర్ రేటింగ్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ (Care Ratings) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఇదివరకూ అంచనా వేసిన 6.5 శాతం క్షీణత నుంచి 8-8.2 శాతానికి సంకోచించే అవకాశముందని అంచనా వేసింది. తాము ఊహించినట్టుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక ఉద్దీపన లేనికారణంగా జీడీపీ (GDP) అంచనాను 8-8.2 శాతానికి సవరించినట్టు కేర్ రేటింగ్ చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నావిస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి గణనీయంగా పడిపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలు తిరిగి ట్రాక్‌లో వచ్చే దాన్ని బట్టి వృద్ధి వేగం ఉంటుందని కేర్ రేటింగ్స్ తెలిపింది.
ఇదివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.4 శాతం ప్రతికూలతను అంచనా వేశామని, ఆ సమయంలో దేశంలో అన్‌లాక్ ప్రక్రియ పురోగతి ఆధారంగా జరిగిందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అలాగే, తొలి త్రైమాసికంలో జీడీపీ (GDP) పతనం 24 శాతానికి తగ్గిందని, ఇది 20.2 శాతం సంకోచంగా తమ అంచనాల కంటే కొంచెం ఎక్కువేనని వివరించింది. సకాలంలో రుతుపవనాలతో వ్యవసాయ రంగంలో, అదే విధంగా రుణ ప్రవాహాన్ని పెంచేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ (RBI) చేసిన ప్రయత్నాలతో ఆర్థిక రంగంలో సానుకూల ధోరణులు కనిపించాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది.