కార్‌దేఖోలో ఉద్యోగాల తొలగింపు!

by  |
కార్‌దేఖోలో ఉద్యోగాల తొలగింపు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: భారత ఆటో రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిన కొవిడ్-19 కారణంగా ఆన్‌లైన్ ఆటో పోర్టల్ కార్‌దేఖో సంస్థ 200 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోన్నది. అలాగే, బోర్డు సభ్యులందరి వేతనాల్లో కోతను కూడా నిర్ణయించింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పలు కంపెనీలు ఉద్యోగాల కోత, వేతనాల కోతను విధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్‌దేఖో సంస్థలో 5 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 200 మందిని తొలగించనున్నారు. పరిస్థితులు మరింత దారుణంగా పరిణమిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం. ఇక, సంస్థలోని ఉద్యోగుల్లో రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్న వారి వేతనాల్లో 12 శాతం, రూ. 5 నుంచి రూ. 15 లక్షల ఆదాయం ఉన్న వారికి 15 శాతం కోత ఉండనుంది. ఈ నిర్ణయం మే నెల నుంచి జూలై నెల వరకు వర్తిస్తుంది. అలాగే, రూ. 15 నుంచి రూ. 40 లక్షల ఆదాయం ఉన్నవారి వేతనంలో 20 శాతం, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారి వేతనంలో 22.5 శాతం కోత విధించనున్నారు. ఇప్పటికే సీనియర్ మేనేజ్‌మెంట్ వేతనంలో 45 శాతం కోత నిర్ణయాన్ని సంస్థ తీసుకుంది.



Next Story

Most Viewed